KDP: దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ పరీక్షల నూతన తేదీలను కంట్రోలర్ ప్రొఫెసర్ SV కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1న జరగాల్సిన డిగ్రీ పరీక్ష డిసెంబర్ 6న ఉదయం, పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు డిసెంబర్ 9న ఉదయం నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ కొత్త తేదీల్లో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.