నెల్లూరు: రూరల్ నెల్లూరుకు చెందిన హేమంత్ అనే వ్యక్తి, వేదాయపాలెం మహిళను ప్రేమ పేరుతో పరిచయమై,పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 నెలలు కలిసి తిరిగాడు. ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో మహిళ సోమవారం ఎస్పీ అజితా వేజెండ్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చింది. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు తన తల్లితో కలిసి తనను కొట్టి బెదిరించారని, విచారించి న్యాయం చేయాలని ఆమె కోరింది.