శ్రీకాకుళం పట్టణంలో గంగు వీధిలో శుక్రవారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ మార్కెట్ వెండింగ్ కమిటీ అడ్వైజర్ ఉంగట రమణమూర్తి మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. తడి పొడి చెత్తలను వాహనాలకు వేరువేరుగా అందించాలన్నారు. ఎమ్మెల్యే శంకర్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.