W.G: ఆకివీడులో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకే ఇక్కడ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జాతీయ రహదారి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. తీవ్రమైన వేడి కారణంగా స్థానికులు ఉదయాన్నే పనులను ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు.