KRNL: జిల్లాలో మిస్సింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. FRS టెక్నాలజీ, సీసీటీఎన్ఎస్ ఏపీ 360 యాప్ సహాయంతో అదృశ్యమైన వ్యక్తులను త్వరగా గుర్తిస్తున్నామని ఆదివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 722 స్మార్ట్ సీసీ కెమెరాల ద్వారా నేరస్తుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.