NDL: డోన్‌లో ఆదివారం నిర్వహించిన ఐద్వా సమావేశంలో ఆ సంఘం నాయకురాలు షేమిమ్ బేగం CM చంద్రబాబు జనాభా పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలను పిల్లల్ని కనే యంత్రాలుగా మాట్లాడడం అభ్యంతరకరమన్నారు. ఎన్నికల హామీలైన నెలకు రూ.1500 అమలు చేయకుండా, మూడో బిడ్డకు నగదు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. జనాభా పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.