SKLM: గార మండలం జొన్నలపాడు గ్రామంలో ఇటీవల తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చేనేత కార్మికులకు శుక్రవారం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గొలువి వెంకటరమణ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు సహాయం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.