గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని 39వ ప్లాట్ఫాం వద్ద నిన్న సాయంత్రం 6 గంటలకు సుమారు 45 ఏళ్ల మహిళ అనారోగ్యంతో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పాతగుంటూరు పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. మృతురాలి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.