విజయనగర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 6 గదులు అద్దెకు ఇవ్వవచ్చన్నారు.