W.G: పాలకొల్లు వైసీపీ సీనియర్ నాయకుడు గుణ్ణం నాగబాబుతో పాటు మరో నలుగురు వైసీపీ నేతలకు మంగళవారం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022లో జరిగిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు.