CTR: వెదురుకుప్పం ఎస్సై నవీన్ బాబు తన సిబ్బందితో మండలంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అక్రమ మద్యం రవాణా, గ్యాంబ్లింగ్ ఈవ్ టీజింగ్, మాఫియా అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డ్రోన్ల నిఘాతో మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్ట వెస్తున్నారు.