E.G: మెప్మా & నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న రాజమండ్రిలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ.కనకరాజు శనివారం తెలిపారు. సుమారు 15 ప్రఖ్యాత కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మా, నర్సింగ్ మొదలైన విద్యార్హతలు కలిగినవారు అర్హులని పేర్కొన్నారు.