W.G: కోపల్లెలోని ఆర్.వి.ఆర్ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఖాళీ స్థలం ఎదురుగా ఉన్న బోదెలో పడి ఉన్న సుమారు 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు కాళ్ల ఎస్సై ను సంప్రదించాలన్నారు.