కోనసీమ: ONGC పైప్లైన్ అగ్ని ప్రమాదం జరిగి సుమారు 3 నెలలు అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని యానాం దరియాలతిప్ప, పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు భద్రత, ఉపాధి కల్పన చూపి మాకు తగు న్యాయం చేయాలని చేస్తున్న రిలే దీక్ష 27వ రోజుకి చేరినట్లు తెలిపారు. న్యాయం చేయకపోతే ఎందాకైనా వెళ్తామని ONGC సమస్త మనుగడను అడ్డుకుంటామని హెచ్చరించారు.