కృష్ణా: గూడూరు(M) ముక్కొల్లు గ్రామ పంచాయతీకి చెందిన రైతులు మంగళవారం రైతు సేవ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించి, ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.