TPT: తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి మంగళవారం ఘనంగా జరిగింది. ఏటా కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీచక్రత్తాళ్వారు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసి హారతి ఇచ్చారు.