KDP: దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీకి పన్ను కట్టలేని స్థితిలో ఉంది. పులివెందులలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి 2006 నుంచి ఇప్పటివరకు కట్టాల్సిన రూ.3.50 లక్షల పన్ను బకాయిలు చెల్లించాలని ఇటీవల కాంగ్రెస్ నాయకులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా, పన్ను బకాయిలపై కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని తెలుస్తోంది.