E.G: నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకి ఇటీవల ఎంపికైంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆమేను అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులను టౌన్ రోటరీ ఆడిటోరియంలో ఇవాళ కలిసి మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వ అన్ని రకాల సహాకారం ఇస్తుందని పేర్కొన్నారు.