ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసిన నారాయణస్వామి ఆలయంలో భక్తులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ఈవో గిరిబాబు నరసింహబాబు వసతులు సమకూర్చారు.