VZM: నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)పరీక్ష జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లో 19 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం సజావుగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ పరీక్షకు 4094 గాను, 4009 మంది హాజరుకాగా 85 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. పరీక్ష జరిగిన కేంద్రాలలో డీఈవో, పరీక్షల శాఖ కమిషనర్ తనిఖీలు నిర్వహించారన్నారు.