NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి మాత ఇవాళ విశేష పుష్పాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రాతకాల పూజలు కుంకుమార్చన, రుద్రాభిషేకం అభిషేకం, మహా మంగళహారతితో పూజలు చేశారు. కార్తీకమాసం కావడంతో జిల్లా నలమూలల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండ చూసుకున్నారు.