నంద్యాల: డిసెంబర్ 7న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యాక్షన్ ప్లాన్‌పై వారికి దిశా నిర్దేశం చేశారు.