ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మంగళవారం మేయర్ నూర్జహాన్ అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన 18 అంశాల ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. రూ. 453 కోట్ల నిధులతో నగరాన్ని సుందరీకరించి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కో-ఆప్షన్ సభ్యులు పెదబాబు ఈ సందర్భంగా వివరించారు.