GNTR: ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా పొన్నూరులో బుధవారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలతో పేద ప్రజల ఆరోగ్యానికి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ర్యాలీలో వైసీపీ శ్రేణులు, మానవతావాదులు పాల్గొని జయప్రదం చేయాలని అంబటి కోరారు.