PLD: నందవరం పొలాల్లో ఆదివారం ఎవరో పడేసిన సిగరెట్ ముక్క కారణంగా వ్యర్థాలకు నిప్పు అంటుకుని, మంటలు దాదాపు 40 ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పశువుల మేత అంతా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న నరసరావుపేట అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి వచ్చి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.