అన్నమయ్య: చిట్వేలి మండలంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కే. నారాయణరెడ్డి మండల అధ్యక్షుడిగా, పి. చిట్టిబాబు ప్రధాన కార్యదర్శిగా, పి. రామాంజనేయులు ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అల్లం అశోక్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి కృషి చేస్తామని వారు తెలిపారు.