GNTR: ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. 5 సం.ల లోపు వయస్సు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు.