VSP: పాత పోస్టాఫీస్ వద్ద ఉన్న కొండగుడి (రాస్ హిల్స్)పై కొలువుదీరిన మేరీమాత ఉత్సవానికి సోమవారం లక్షకు పైగా భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకుని, కుటుంబ సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు. భక్తుల భారీ రద్దీ కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించారు. కొండగుడి పరిసరాలు విద్యుత్ అలంకరణలను ఏర్పాటు చేశారు.