VSP: తీవ్ర సంక్షోభంలో ఉన్న విమానయానరంగ సమస్య పరిష్కారంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఈ సమస్యను లోకేష్ వార్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నరని విమర్శలు చేశారు.