SS: గోరంట్లలో మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి సవిత హౌసింగ్ ప్రగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పీఎంఏవై 1.0 కింద జిల్లాకు 57,853 ఇళ్లు మంజూరు కాగా, మెజారిటీ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పీఎంఏవై 2.0 లో అదనంగా 2,019 ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.7.64 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.