అన్నమయ్య: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహాన్ ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 18 నెలల్లో అమలు చేసిన పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీలు నెరవేర్చలేదన్నారు.