NTR: జగ్గయ్యపేటలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారిన పడకుండా స్వచ్ఛమైన జీవన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. డ్రగ్స్ వాడకం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థతో పాటు సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు.