E.G: గోకవరం మండలం గంగంపాలెం గ్రామంలో 40 ఏళ్లుగా కొండపోడు, సీలింగ్ భూమి వ్యవసాయం చేసుకుంటున్నపేద రైతులకు భూమి హక్కు కల్పించే విధంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు తీసుకున్నారు. అనంతరం రైతుల పాస్ పుస్తకాలు సంబందించిన 39 ఎకరాలకు 56 మందికి పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన లబ్ధిదారులకు పట్ట బుక్లు అందజేసినట్లు తెలిపారు.