TPT: భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డులు-2026కు అర్హులైన ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తిరుపతి సెట్విన్ CEO పి.యశ్వంత్ తెలిపారు. సామాజిక సేవా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారు అధికారిక వెబ్సైట్ లేదా తిరుపతి అలిపిరి రోడ్డులోని సెట్విన్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను మే 30లోగా సమర్పించాలని అధికారులు తెలిపారు.