VZM: ఆదర్శ రైతు సాలా మురళీకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. బొబ్బిలి మండలంలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు నుంచి శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని, సాగునీటి కాలువలు, చెరువుల ఆక్రమణలకు వ్యతిరేకంగా నిత్యం పోరాటం చేశారు. మామిడి, చెరకు, వరి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించే వారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.