NLR: మతిస్థిమితంలేని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిని అరెస్టు చేసినట్లు సోమవారం ఎస్సై రాకేశ్ తెలిపారు. ఇటీవల మనుబోలు మండలంలోని గొట్లపాలెం గ్రామానికి చెందిన మానసిక వైకల్యం కలిగిన మహిళపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు బుడగ పెంచలయ్య మద్యం మత్తులో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.