GNTR: వడ్డేశ్వరంలోని KL యూనివర్సిటీలో శనివారం జరిగిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. విద్యార్థులే రేపటి భారత నిర్మాతలని ఆకాంక్షించిన ఆమె, వారితో నేరుగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలతో పాటు, అంతర్జాతీయ మహిళా సదస్సు, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్లను ఆవిష్కరించారు.