KDP: రోజంతా లారీ నడుపుతూ కుటుంబ భవిష్యత్ కోసం కష్టపడిన ఓ తండ్రి కన్నీటి కల నేడు నిజమైంది. వేంపల్లెలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు డా. సమీర్ బాషా ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చారు. వేంపల్లెకు లారీ డ్రైవర్ కుమారుడు వైద్యుడు కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.