కృష్ణా: గుడ్లవల్లేరులో దోమల అరికట్టేందుకు పంచాయతీ సిబ్బంది మంగళవారం అబేట్ స్ప్రేయింగ్ నిర్వహించారు. గ్రామంలోని నీటి నిల్వ ప్రదేశాలు, డ్రైనేజీలు, ఇళ్ల వద్ద ఉన్న నీటి కుండలు తదితర ప్రాంతాల్లో సిబ్బంది సమగ్రంగా అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారణకు ఈ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.