KRNL: ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన ఈరమ్మ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇస్వీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ కుమార్, ఇవాళ తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.