ప్రకాశం: మార్కాపురం శివారు ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. బుధవారం పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మందు సీసాలను మున్సిపల్ సిబ్బంది చేత తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంకటరెడ్డి, ఎస్సై సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.