ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్లు అవగాహన సదస్సులు నిర్వహించాయి. కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్, రూరల్, తాడిపత్రి సబ్ డివిజన్లలోని విద్యార్థులు, ప్రజలకు సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, బాల్యవివాహాలు, మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించారు. అలాగే శక్తి యాప్, 100/112 నంబర్ల ఉపయోగాలు వివరించారు.