ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. నూజివీడులో సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు.