కృష్ణా: గుడివాడలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ‘కోటి సంతకాల’ కార్యక్రమం నేటితో ముగింపుదశకు చేరుకుందని వైసీపీ నేతలు మంగళవారం తెలిపారు. గుడివాడ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీన లింగవరంలో జరగనున్న ‘కోటి సంతకాల’ సేకరణ ప్రతులను జిల్లా పార్టీకి అందజేసే కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొంటారని వెల్లడించారు.