NLR: ఎన్టీఆర్ నగర్ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, రోడ్డు ప్రమాద వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి విచారం వ్యక్తం చేశారు.