KRNL: మంత్రి సత్య కుమార్ ఆదేశాలతో ఆదివారం ఎబోలాపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్యపరీక్షలు తప్పనిసరి చేసింది. కర్నూలు, విశాఖ, తిరుపతి, విజయవాడ సహా అన్ని ఎయిర్‌పోర్టుల్లో వారికి ప్రత్యేక టెస్టులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు.