KRNL: ఆదోనిలోని ఫారిసమొహల్లా ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఆదోని సబ్ డివిజన్ శక్తి టీం వెంటనే అక్కడికి చేరుకొని బాల్య వివాహం దానిని నివారించింది. ఇది చట్టరీత్యా నేరమని, దాని వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించింది. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఇవాళ ఆదోని 2 టౌన్ సీఐ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని రద్దు చేశారు.