VZM: గంట్యాడ, బొండపల్లి మండలాల్లో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మామిడి, టమాట రైతులు పండిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటను విక్రయించుకునే వెసలుబాటును రైతులకు కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.