KDP: దువ్వూరు మండలంలోని చిన్న సింగనపల్లె, గుడిపాడు గ్రామంలో శనివారం జూదమాడుతున్న 18 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు SI వినోద్ కుమార్ తెలిపారు. జూద కేంద్రాలపై దాడి చేసి చిన్న సింగనపల్లి గ్రామంలో 7 గురిని అరెస్టు చేసి రూ. 2,900 నగదును, గుడిపాడులో 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 5,160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.