ప్రకాశం: ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో సరైన సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి తాహిద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఆయన కనిగిరిలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ నిరంతరం ప్రయత్నిస్తోందని, విద్యార్థులకు కావలసిన కాస్మెటిక్, ఛార్జ్ ప్లేట్లు, దుప్పట్లు అందజేయాలని ఆయన కోరారు.